ఆరోగ్య సమస్యలకి యోగా ఒక్క చక్కని సమాధానం

ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగా చేయాలి

ఎమ్మెల్యే కురుగొండ్ల, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తిక్

పెంచలకోనలో సామూహిక యోగాంధ్ర

ఆరోగ్య సమస్యలకి యోగా ఒక్క చక్కని సమాధానం

  • ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగా చేయాలి
  • ఎమ్మెల్యే కురుగొండ్ల, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ కార్తిక్
  • పెంచలకోనలో సామూహిక యోగాంధ్ర


ఆరోగ్య సమస్యల్ని యోగా ఒక్క చక్కని సమాధానం అని, ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగా చేయాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ లు పిలుపునిచ్చారు. పెంచలకోన క్షేత్రంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వారు పాల్గొని యోగాసనాలు వేశారు.


పర్యాటక శాఖ ఆధ్వర్యంలో…నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద సామూహిక యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్, పలువురు జిల్లాస్థాయి అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతమైన వాతావరణంలో అందరి చేత యోగా గురువుల యోగాసనాలు వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల, ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్ లు మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యల్ని యోగా ఒక్క చక్కని సమాధానం అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగాసనాలు వేయాలని…యోగాని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, ఎంపీడీవో భవాని, సీఐ సత్యనారాయణ, సిబ్బంది, యువత, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *