అనేక సమస్యలపై వినతులు అందచేసిన బాధితులు
అర్జీలు స్వీకరించిన కలెక్టర్
- అనేక సమస్యలపై వినతులు అందచేసిన బాధితులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు.
నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వేదికకు వచ్చే ప్రతీ అర్జీని క్షుణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అర్జీలు రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ఉదయభాస్కర్, డీపీవో శ్రీధర్ రెడ్డి, సర్వే అధికారి నాగ శేఖర్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.