ముత్తుకూరు బస్టాండ్ నిర్వహణపై అసంతృప్తి.
ఆకస్మికంగా తనిఖీ చేసిన జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి
APSRTC అధికారులపై ఆగ్రహం.
ముత్తుకూరు బస్టాండ్ నిర్వహణపై అసంతృప్తి.
ఆకస్మికంగా తనిఖీ చేసిన జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి
నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని APSRTC బస్టాండ్ ను ఆర్టీసీ నెల్ జోనల్ చైర్మన్.సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముత్తుకూరు విచ్చేసిన సురేష్ రెడ్డి కి మండల బీజేపీ అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి బస్టాండ్ ఆవరణ…పరిసరాలు, మరుగుదొడ్లు, ప్రయాణికులు కూర్చునే బెంచీలు పరిశీలించిన చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన సురేష్ రెడ్డి అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం తెచ్చే రూట్ లో ఉన్న బస్టాండ్ నిర్వహణ ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని బస్టాండ్ పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు. ముత్తుకూరు రూట్ లో కొత్తబస్సులు నడపాలని… వాకాడు ముత్తుకూరు మధ్య సర్వీసులు పెంచాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవీంద్ర రెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, ఈపూరు శివ, ఆర్టీసీ అధికారులు తదితరులు ఉన్నారు.