కార్పొరేషన్లో ముందస్తు మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టిన నారాయణ
హ్యాపీ బర్త్ డే నారాయణ సార్…
- శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, అధికారులు
రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా… ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డీ ,కంభం విజయరామి రెడ్డి, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ ,కార్పొరేటర్లు ,జిల్లా అధికారులు, పోలీసు అధికారులు నారాయణను కలసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి పూల బొకేలు అందచేసి…శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలు ,కార్యకర్తలు ,అభిమానులు, అధికారులు, అభిమానులతో మంత్రి కార్యాలయం కిటకిట లాడింది.