– దేవేరులతో కలసి ఊరేగిన దేవదేవుడు.
దువ్వూరు లో ఘనంగా బ్రహ్మోత్సవాలు
శేష వాహనంపై కోటేశ్వరుడు.
దేవేరులతో కలసి ఊరేగిన దేవదేవుడు.
దువ్వూరు లో ఘనంగా బ్రహ్మోత్సవాలు
నెల్లూరు. జిల్లా…సంగం మండలం దువ్వూరు గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతి సమేత కోటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి .ఉత్సవాల్లో భాగంగా శేష వాహనం పై స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.శేష వాహనం పై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలుఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామ పుర వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది.గ్రామోత్సవం ముందు ఏర్పాటు చేసిన కోలాటం భజన భక్తులను ఆకట్టుకుంది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి ..తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి బలిజ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు .