వెంకటగిరి నియోజకవర్గం బీజేపీ కన్వినర్ నాయుడు
భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది..!
వెంకటగిరి నియోజకవర్గం బీజేపీ కన్వినర్ నాయుడు
భారత్ అన్ని రంగాల్లో.. అభివృద్ధి పథంలో పోటీపడి.. పేదరికం నుంచి ఐదు కోట్ల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ప్రధానమంత్రి మోడీదని, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పేదరికం లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ పరుగులు తీస్తోందిని.. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు. ఈమేరకు ఆయన వెంకటగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. వికసిత్ భారత్ ముందూసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దామా గురు ప్రసాద్, పట్టణ యువత అధ్యక్షుడు కన్న చిన్న, నాయకులు తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.