కంగుందిలో యోగాంధ్ర
ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి…
- కంగుందిలో యోగాంధ్ర
చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన కంగుందిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు, ప్రజలతో కలసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం పీఎస్ మునిరత్నం మాట్లాడుతూ యోగా చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యుఐడీసీ చైర్మన్ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు, డాక్టర్ సురేష్, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..