సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది
- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 39 మంది లబ్ధిదారులకి రూ. 34 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ సనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువచేసే సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిధిలో 7 చెక్కుల ద్వారా రూ.12 లక్షల 8 వేలు, అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి రూ.21 లక్షల 81 వేలు అందజేశారు. ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3 కోట్ల 24 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.