కల్తీలేని వార్తలు సంచలనం రేపే కథనాలు
ప్రసిద్ద బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలసి ఆయన సమీక్షించారు.
వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అనే మోసం అనే పుస్తకాన్ని వైసీపీ ముఖ్య నేతలతో కలసి ఆయన ఆవిష్కరించారు.
నిరుపేదలు నివసించే ప్రాంతంలో అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేశామని, పిల్లల సంతోషం చూస్తే చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వెంకటేశ్వరపురంలోని ఏపీజే అబ్ధుల్ కలాం పార్క్ ని ఆయన ప్రారంభించారు.
ఆ క్రాస్ రోడ్ యాక్సిడెంట్ జోనగా మారింది. మొన్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా, నేడు అదే స్పాట్ లో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. వరుస ప్రమాదాలతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. డెత్ స్పాట్ పై ఎన్ న్యూస్ ప్రత్యేక కథనం.
APSRTC అధికారులపై ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరులోని ఆర్టీసీ బస్టాండ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండులో వసతులపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దువ్వూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత కోటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు శేష వాహనంపై భక్తులను దర్శనమిచ్చారు.
అల్లీపురం డంపింగ్ యార్డ్ లెగసి వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. రీ సైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రతీ డివిజన్లో కేక్ కట్ లు చేసి సంబరాలు చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే నారాయణ సార్ అంటూ తమ అభిమానాని చాటుకున్నారు.
వికలాంగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో మానవ దృక్పథంతో స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశం కల్పించారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర రావు తెలిపారు. కావలిలో జరిగిన ఆత్మ గౌరవ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
నెల్లూరు నగరం కోటమిట్టలో ఐదు స్వీపింగ్ మిషన్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీఫింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు.
నీట్ 2025 పరీక్షా ఫలితాల్లో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారని విద్యా సంస్థల ఎండీ రంగిశెట్టి వేణు తెలిపారు. ఆలిండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని యాజమాన్యంగా ప్రత్యేకంగా అభినందించింది.
కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. వారికి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. 39 మంది లబ్ధిదారులకి రూ. 34 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ సనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
కోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభంపై ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో గ్రామస్థులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.