యాక్సిడెంట్ జోన్‌గా ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్
వరుస ప్రమాదాలతో ఆందోళన
మొన్న ఇద్దరు కూలీల మృతి
నేడు అదే స్పాట్‌లో బైక్.. కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాదాల నియంత్రణకు చర్యలు కోరుతూ.. అధికాయంత్రాంగానికి ఎన్-3 సూచన
డెత్.. స్పాట్..!
- యాక్సిడెంట్ జోన్‌గా ఏ.ఎస్.పేట క్రాస్ రోడ్
-వరుస ప్రమాదాలతో ఆందోళన
-మొన్న ఇద్దరు కూలీల మృతి
-నేడు అదే స్పాట్‌లో బైక్.. కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం
-ప్రమాదాల నియంత్రణకు చర్యలు కోరుతూ..
అధికాయంత్రాంగానికి ఎన్-3 సూచన
ఇది.. డెత్ స్పాట్..
అవును.. ఆ క్రాసింగ్‌లో..క్రాస్ చేస్తే పై లోకాలకే
కాస్త ఏమరపాటుగా ఉన్నా.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. మృత్యువు కబళించినట్లే..
టైం.. బాగున్నా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవడం..లేక.. శాస్వత అంగవైకల్యమో..
ఎందుకంటే.. అది యాక్సిడెంట్ జోన్.. డెత్ స్పాట్..
ఇది.. నిజం.. అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారిందా క్రాస్ రోడ్..
ఇంతకు ఆ డెత్ స్పాట్ ఎక్కడనుకుంటున్నారా..? అదేనండి.. నిన్న గాక మొన్న కూలీ పనులకు వెళ్తున్న ఓ ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన ఆత్మకూరు నియోజకవర్గం.. ఏఎస్ పేట క్రాస్‌రోడ్డు. ఇదే స్పాట్‌లో నేడు కూడా.. ఓ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్‌లో వెళ్తూ.. రోడ్డుక్రాస్ చేస్తుండగా.. ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. గతంలోనూ అదే స్పాట్‌లో అనేక ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులయ్యారు. ఈ రెండు ప్రమాదాలకు సంబంధించిన వీడియో పుటేజీలను ఎన్-3 మీ.. ముందుకు తెస్తోంది. ఈ ఘటనల్లో నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. తొందరపాటు ఖచ్చితంగా అటు.. ఇటూ.. గమనించకుండా.. రోడ్డు క్రాస్ చేసేవారిదే అయినా.. క్షణాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలసి పోతున్నాయి. దాంతో వారిని నమ్ముకున్న కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. సో.. హైవే అథారిటీ.. జిల్లా పోలీసు అధికారులు.. కలెక్టర్ స్పందించి.. ఆ ప్రాంతంలో వేగ నియంత్రణతోపాటు.. ప్రమాదాల నియంత్రణకు ఏవైనా ఏర్పాట్లు చేయాలని.. సంబంధిత అధికారులు పరిశీలించి.. తగు చర్యలు తీసుకోవాలని.. ప్రజల తరఫున ఎన్-3 అధికార యంత్రాంగాన్ని కోరుతోంది.