అడ్మిషన్లను ప్రారంభించిన మంత్రి నారాయణ
తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిన వీఆర్ హైస్కూల్ ప్రాంగణం
జూన్ 23న వీఆర్ హైస్కూల్ లాంఛనంగా ప్రారంభం
- అడ్మిషన్లను ప్రారంభించిన మంత్రి నారాయణ
- తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిన వీఆర్ హైస్కూల్ ప్రాంగణం
వీ ఆర్ పాఠశాలను తిరిగి ప్రారంభించి ఎన్నికల సమయంలో నెల్లూరు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని మంత్రి నారాయణ గుర్తు చేశారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన… అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థులతో వి ఆర్ హైస్కూల్ కిటకిట లాడింది. మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి వి ఆర్ పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మాట్లాడారు. పాఠశాల మొత్తం వారు కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ ని వైఎస్సార్సీపీ హయాంలో మూత పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో వీఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఉంటుందని..వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు నిరుపేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించబోతున్నట్లు తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్… రవాణా సౌకర్యాలతో పూర్తి ఉచితంగా విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అందుతుందన్నారు. ఈనెల 23న లాంఛనంగా వి ఆర్ పాఠశాల ప్రారంభోత్సవం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, పాటు కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్.. టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్ తాళ్ళపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు,44 డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు,క్లస్టర్ ఇంచార్జి పుట్ట అజయ్,45 డివిజన్ అధ్యక్షుడు సుజన్.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.