68 కేజీల కేకు కట్‌చేసి సంబరాలు
ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు
68 కేజీల కేకు కట్‌చేసి సంబరాలు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా అర్థరాత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు ఆధ్వర్యంలో.. మంత్రితో 68 కేజీల కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాన నేత నారాయణకు పుట్టిన రోజు శుభాకాంక్షులు తెలియజేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో క్యాంపు కార్యాలయం రద్దీగా మారింది. అందరూ నారాయణకు జన్మదిన శుభాకాంక్షులు తెలిజేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.