గ్రామస్థులకి అవగాహన కల్పించిన వైద్యాధికారులు
గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక అవగాహన కార్యక్రమం
మునెల్లపల్లిలో టీబీ ముక్త భారత్
- గ్రామస్థులకి అవగాహన కల్పించిన వైద్యాధికారులు
- గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక అవగాహన కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మునెల్లపల్లి పంచాయతీలో టి. బి ముక్త్ భారత్ కాంపెయిన్ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ జహిదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు పాల్గొని టీబీ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ… రెండు వారాలకు పై బడి దగ్గు, ఛాతిలో నొప్పి, గస, ఆయాసం, గళ్ళ, రక్తం గళ్ళలో పడడం, రాత్రి పూట జ్వరం వంటి లక్షణాలు ఉంటే టి.బి వ్యాధి అని అనుమానంతో ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. టీబీ వ్యాధి గ్రస్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి, ఎంపీటీసీ షహీనా, పలువురు అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.