ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ..

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, అధికారి యంత్రాంగం

చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర మాజీ నాయకుడు భాస్కర్ డిమాండ్

ప్రైవేట్ విద్యాసంస్థల పీజుల దోపిడీ…

  • పట్టించుకోని విద్యాశాఖ అధికారులు, అధికారి యంత్రాంగం
  • చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ రాష్ట్ర మాజీ నాయకుడు భాస్కర్ డిమాండ్

ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర నాయకుడు భాస్కర్ ఆరోపించారు. కావలిలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.


విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని పిడిఎస్ యూ మాజీ రాష్ట్ర నాయకుడు కరవది భాస్కర్ తెలిపారు. పాఠశాలలో తీస్తున్నారంటే విద్యార్థుల కంటే తల్లిదండ్రులే భయపడే పరిస్థితి నెలకొందన్నారు చదువు ఫీజులేకాకుండా, బుక్స్ యూనిఫామ్ రవాణా సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అదనపు వసూళ్లు కు పాల్పడుతున్నట్లు తెలిపారు. తమ పిల్లలకు మంచి చదువులతో ఉన్నత స్థితికి ఎదగాలన్న తల్లిదండ్రుల ఆశలను ప్రైవేటు విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా ఏ అధికారి తనిఖీలు ఉండటం లేదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, అధికార యంత్రాంగం దృష్టిసారించి ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఆయన కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు ఆమంచి సుబ్బు, మహేంద్ర ఉన్నారు. కావలిలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *