ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సీఎం
తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నగదు జమ
47వ డివిజన్ సచివాలయంలో తల్లికి వందనం జాబితాను పరిశీలించిన టీడీపీ నేతలు
చరిత్రను తిరగరాసిన చంద్రబాబు
- ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సీఎం
- తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నగదు జమ
- 47వ డివిజన్ సచివాలయంలో తల్లికి వందనం జాబితాను పరిశీలించిన టీడీపీ నేతలు
తల్లికి వందనం పథకం అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా సచివాలయాల్లో అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం 47వ డివిజన్ లోని సచివాలయంలో జరుగుతున్న తల్లికి వందనం జాబితా పరిశీలన ప్రక్రియను… టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు పరిశీలించారు. తల్లిదండ్రులు, పిల్లలతో మాట్లాడి.. అర్హులైన వారిని గుర్తించి వారి ఖాతాలో జమైందా లేదా అని బ్యాంకులు వద్దకు వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సుబ్బారావు ఎన్3 న్యూస్ తో మాట్లాడారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఘనత ఒక్క చంద్రబాబునాయుడుకే సాధ్యమని కొనియాడారు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికి తల్లికి వందనం అమలు చేయడం ఓ చరిత్ర అన్నారు. అనంతరం తల్లులు వారి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి ధర్మవరం గణేష్ కుమార్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.