ఈద్గా అభివృద్ధికి రూ. 1 లక్ష విరాళం

_కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా నిర్ణయం

తండ్రి పేరుతో ప్రతీ సంవత్సరం విరాళం అందచేస్తానన్న ఖాజా మొహిద్దీన్

ఈద్గా అభివృద్ధికి రూ. 1 లక్ష విరాళం

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం సందర్భంగా నిర్ణయం
  • తండ్రి పేరుతో ప్రతీ సంవత్సరం విరాళం అందచేస్తానన్న ఖాజా మొహిద్దీన్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొహిద్దీన్ తండ్రి సయ్యద్ రసూల్ సాహెబ్ పేరిట ఈద్గాకు లక్ష రూపాయలు విరాళంగా ముస్లిం పెద్దలకు అందచేశారు. ఈ సందర్భంగా ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ…గడిచిన సంవత్సరం కాలంలో సంక్షేమ పథకాలు విరివిగా అమలు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఇచ్చిన విధంగానే తన తండ్రి పేరిట ప్రతీ సంవత్సరం లక్ష రూపాయలు విరాళంగా ఈద్గాలకు ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్ నాయుడు, సయ్యద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *