కూటమి పాలన ఏడాదైన సందర్భంగా కేక్ కటింగ్_
సంగంలో టీడీపీ సంబరాలు…
- కూటమి పాలన ఏడాదైన సందర్భంగా కేక్ కటింగ్
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా…టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.
నెల్లూరు జిల్లా సంగం బస్ స్టాండ్ సెంటర్ లో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా టీడీపీ నాయకులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.ఎన్నికల్లో చెప్పిన విధంగా తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతీ విద్యార్థికి 15 వేల రూపాయలు ఇస్తున్నారని అన్నారు.బడుగు బలహీన వర్గాల వారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంగం సొసైటీ త్రీ మెన్ కమిటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ ,మహిళా నాయకురాలు మంజుల నాయుడు,మండల ప్రధాన కార్యదర్శి మాఘం గిరిబాబు,గునుపూడి గిరి,సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు,టీడీపీ టౌన్ అధ్యక్షులు నాగరాజు,శ్రీనివాసులు నాయుడు,వేణు బాల తదితరులు పాల్గొన్నారు.