సంగం మండల వ్యవసాయాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్
రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- సంగం మండల వ్యవసాయాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాలలో ఈకేవైసి చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి గా శశిధర్ తెలిపారు. సంగం మండల వ్యవసాయాధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
సంగం వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి గా శశిధర్ బాధ్యతలు స్వీకరించారు.సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయాధికారి శ్రీహరి బుచ్చిరెడ్డిపాలెం కి బదిలీ అవగా..చేజర్ల లో పనిచేస్తున్న శశిధర్ సంగం కి బదిలీ పై వచ్చారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియచేశారు.అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రైతు సేవా కేంద్రాలలో ఈకేవైసి చేయించుకోవాలని సూచించారు.అదేవిధంగా రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.