మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపి స్టంట్

ఆపరేషన్ ను విజయవంతం చేసిన నెల్లూరు నారాయణ వైద్యులు_

మూడేళ్ల చిన్నారికి ఎండోస్కోపి స్టంట్

  • ఆపరేషన్ ను విజయవంతం చేసిన నెల్లూరు నారాయణ వైద్యులు


మూడేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే చికిత్సను విజయవంతం చేశామని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎంజీ శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు.


ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతానికి చెందిన ఓబుల లక్ష్మీదేవి అనే మూడేళ్ల పాప గత వారం రోజులుగా విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతోంది. తల్లిదండ్రులు అనేక హాస్పిటల్స్ తీసుకెళ్లారు. అయినా తగ్గకపోవడంతో వారు వెంటనే నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ లోని మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎంజీ శ్రీనివాస్ ని సంప్రదించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాపకి అన్నీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో క్లోమ గ్రంధి సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ పాపకి శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీతోనే స్టంట్లు వేసి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. హరీష్ తో కలసి డాక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎండోస్కోపీ శస్త్ర చికిత్సతో పాప రికవరీ అయ్యి…ఆడుకుంటుందని తెలిపారు. మెట్రోపాలిటిన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని…నారాయణ హాస్పిటల్లో అన్నీ శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలందరూ ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాప తల్లిదండ్రులు మాట్లాడారు. ఈ సమావేశంలో నారాయణ హాస్పిటల్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. అరుణ్ కాంత్, ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *