కారు అద్దాల పగులగొట్టి మరీ రూ. 8.90 లక్షల నగదు అపహరణ
ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఘటన_
భారీగా దోచేశారు…
- కారు అద్దాల పగులగొట్టి మరీ రూ. 8.90 లక్షల నగదు అపహరణ
- ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ఘటన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వద్ద భారీ చోరీ జరిగింది. ఏఎస్‌పేటకు చెందిన చిలకపాటి శ్రీను అనే వ్యక్తి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సభా బేగం అనే మహిళకు అమ్మేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు వచ్చారు. నగదు తీసుకుని తన కారులో ఉంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు కార్యాలయం లోపలికి వెళ్లారు. ముందుగానే రెక్కీ నిర్వహించిన దొంగలు అదును చూసి కారు అద్దాలు పగలగొట్టి 8లక్షల 90 వేల నగదును ఎత్తుకెళ్లారు. చోరీ జరిగినట్లుగా గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.