ప్రజా పాలనకు ఏడాది పూర్తి..

నెల్లూరు గోమతి క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు…

భారీ కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు

ప్రజా పాలనకు ఏడాది పూర్తి…

  • నెల్లూరు గోమతి క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు…
  • భారీ కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు


కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా…నెల్లూరు గోమతి నగర్ నగర్లోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు అంబరన్నాంటాయి. ఏడాదిని పురస్కరించుకొని…టీడీపీ శ్రేణులు 12 కేజీల భారీ కేక్ ని కట్ చేసి అందరికి పంచి పెట్టారు. జిందా బాద్ తెలుగుదేశం పార్టీ…వర్ధిల్లాలి నారాయణ గారి నాయకత్వం అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ చైర్మన్ తాళ్ళపాక అనూరాధ, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు. పండుగలా విజయోత్సవ సంబరాలు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ ప్రజా పాలనకు నేటితో ఏడాది పూర్తి సందర్భంగా ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తైందన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతీ హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి , మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి , డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *