నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కోటంరెడ్డి- వీపీఆర్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు
రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోటంరెడ్డి సోదరులను చూసి ఎంతో నేర్చుకోవాలి..!
నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కోటంరెడ్డి- వీపీఆర్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంబరాలు
రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం- కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు- నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిచ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విశిష్ఠ అతిధిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు భారీగా కేకు కోసి అందరికీ తినిపించారు. అనంతరం వీపీఆర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరకాలంలో రాష్ట్రమంతటా గుంతలు లేని రోడ్లను తయారుచేసుకున్నామని.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇద్దరు కలసి ఏ కార్యక్రమం చేసినా.. చాలా అద్భుతంగా చేస్తారని.. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని ఈసందర్భంగా ఆయన కొనియాడారు. ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని.. ఆ పార్టీ విధానాలతో.. రాష్ట్రం ఆర్థికంగా దివాళాతీసినా, తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ, దిశా మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తుకోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జులు, కో క్లస్టర్ ఇంచార్జులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధసంఘ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.