కావలిలో ఐదేళ్ల విధ్వంసం పాలనకు చెక్ పెట్టి ప్రగతి, సంక్షేమంతో కూటమి పాలన పరుగులు
ఎమ్మెల్యే, కూటమి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు_
కూటమి వన్ ఇయర్ సంబరం
- కావలిలో ఐదేళ్ల విధ్వంసం పాలనకు చెక్ పెట్టి ప్రగతి, సంక్షేమంతో కూటమి పాలన పరుగులు
- ఎమ్మెల్యే, కూటమి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కూటమి నాయకులు బుదవారం సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ… కూటమి పాలన సారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏడాది పాలన పూర్తవడం అభినందనీయం అన్నారు. విధ్వంసం ,రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం,అబివృద్ధి దిశగా పాలన సాగుతోందన్నారు.