అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వం

ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న సీఎం చంద్ర‌బాబునాయుడు

కురుగొండ్ల రామ‌కృష్ణ‌_ _వెంక‌ట‌గిరిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలు

అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న కూట‌మి ప్ర‌భుత్వం
ఇచ్చిన మాట నెర‌వేరుస్తున్న సీఎం చంద్ర‌బాబునాయుడు
కురుగొండ్ల రామ‌కృష్ణ‌
వెంక‌ట‌గిరిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలు

తిరుపతి జిల్లా.. వెంకటగిరిలోని టిడిపి కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా.. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వ‌ర్యంలో సంబ‌రాలు జ‌రుపుకున్నారు. కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సంద‌ర్భంగా కురుగొండ్ల మీడియాతో మాట్లాడారు. వైసీపీ పరిపాలన అరాచక పరిపాలనని, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని, ఇప్పటికే దీపం పథకం, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, రైతులకు గిట్టుబాటు ధరలు, అలాగే రైతులకు రెండో పంటకు పుష్కలంగా నీరు ఇస్తున్నామని, ఈరోజు నుంచే తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఆయ‌న తెలిపారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రామదాసు గంగాధరం, రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, మరియు మాజీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, జనసేన పట్టణ అధ్యక్షుడు రామారావు అనిల్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దామా గురు ప్రసాద్, నియోజకవర్గంలో అన్ని మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *