రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత…
- రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు
నెల్లూరు జిల్లా సంగంలో పోలీస్ లు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ లకు రాబడిన సమాచారం మేరకు సంగం జాతీయ రహదారిపై వాహనాన్ని వెంబడించి సంగం బుచ్చి టోల్ ప్లాజా మధ్యలో రేషన్ బియ్యం వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని..కేసు నమోదు చేశారు.నాగుల వెల్లటూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లు కి తరలిస్తున్నట్లు సమాచారం.