ఎమ్మెల్యే కురుగొండ్ల_ _13 మందికి రూ. 13.72 లక్షల చెక్కులు పంపిణీ_
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి…
- ఎమ్మెల్యే కురుగొండ్ల
- 13 మందికి రూ. 13.72 లక్షల చెక్కులు పంపిణీ
వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అందచేశారు. ప్రభుత్వం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా పేదలకి ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పలు హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 13 మందికి రూ. 13 లక్షల 72వేల రూపాయల చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలుగు దేశం ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా… ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలకు సహాయం చేస్తోన్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు జరిగిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.