బాలకృష్ణ జీవితం ఆదర్శం..

కావలిలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

సెల్ఫీ పాయింట్ వద్ద బాలకృష్ణ అభిమాన సంఘం అధ్వర్యంలో కేక్ కటింగ్

వేడుకల్లో హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి_

బాలకృష్ణ జీవితం ఆదర్శం…

  • కావలిలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు
  • సెల్ఫీ పాయింట్ వద్ద బాలకృష్ణ అభిమాన సంఘం అధ్వర్యంలో కేక్ కటింగ్
  • వేడుకల్లో హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి


కావలిలోని సెల్ఫీ పాయింట్ వద్ద సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమాన సంఘం అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద బాలకృష్ణ అభిమానులు, టిడిపి శ్రేణులు భారీ సంఖ్యల హాజరుకాగా వారి మధ్యలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… బాలకృష్ణ నిరాడంబర జీవితం ఎంతో ఆదర్శమన్నారు. ఆయన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడుగా, సినీ హీరోగా, రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా ధర్పం చూపించారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని, ఆయన అల్లుడు టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. బాలకృష్ణ అభిమాన సంఘం నేత జ్యోతి బాబురావు మాట్లాడుతూ తాము అభిమాన సంఘంగానే కాకుండా సేవా సంఘంగా కూడా అని తెలిపారు. బాలకృష్ణను పూర్తిగా తీసుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *