రైతులకి మద్దతు ధరతోపాటు 24 గంటల్లోనే నగదు చెల్లింపు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి_ _విడవలూరు చౌకిచర్లలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
చివరి ఆయకట్టు వరకు పుష్పలంగా సాగునీరు
- రైతులకి మద్దతు ధరతోపాటు 24 గంటల్లోనే నగదు చెల్లింపు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- విడవలూరు చౌకిచర్లలో ఘనంగా ఏరువాక పౌర్ణమి
రైతులకి చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా సాగునీరు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. చౌకిచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. విచ్చేసిన ఎంయల్ఏకి స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు ఘనస్వాగతం పలికారు. రైతు నాయకుడు అశోక్ కుమార్ ఎడ్లబండిపై ఎంయల్ఏ ఎక్కి ఏరువాక కార్యక్రమం వద్దకు చేరుకున్నారు .ఈ సందర్భంగా ఎంయల్ఏ ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…రైతులు పండించుకున్న పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడమే కాకుండా పంట అమ్ముకున్న రైతులకు ఇరవై నాలుగు గంటల్లో నగదు చెల్లించిన నాయకుడు ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అని అన్నారు. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు శ్రీహరి రెడ్డి , మురళి రెడ్డి , బెజవాడ వంశీకృష్ణారెడ్డి , చెముకుల శ్రీనివాసులు, అచ్యుత్ రెడ్డి , సమాధి శ్రీనివాసులు ,స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు