సరైన పత్రాలు లేని 21 మోటారు బైక్ స్వాధీనం
సుమారు 300 ఇళ్లను జల్లెడ పట్టిన పోలీసులు_
ఆత్మకూరులో కార్డన్ సెర్చ్…
- సరైన పత్రాలు లేని 21 మోటారు బైక్ స్వాధీనం
- సుమారు 300 ఇళ్లను జల్లెడ పట్టిన పోలీసులు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తిప్ప ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. సుమారు 60 మంది పోలీసులు 300 ఇళ్లల్లో తనిఖీ చేశారు. సరైన పత్రాలు 21 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు…ఆత్మకూరు టౌన్ పరిధిలోని తిప్పలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆత్మకూరు DSP ఆద్వర్యంలో CIలు, 8 మందిSIలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 60 మంది సుమారు 300 ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 21 బైకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు… 15 మంది స్థానికేతరులను గుర్తించి, వేలిముద్రలు సేకరించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ చేపట్టామని పోలీసులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.