అదిక‌దా.. కావ్య అంటే..!

ప్ర‌మాదాన్ని గ్ర‌హించిన ఎమ్మెల్యే కావ్య‌

ఆముదాల దిన్నె వ‌ద్ద రోడ్డుకు అడ్డంగా ప‌డివున్న విద్యుత్ తీగ‌లు

సంబంధిత అధికారుల‌కు కాల్‌చేసి స‌మాచారం ఇచ్చిన ఎమ్మెల్యే

వాహ‌న‌దారుల‌కు ప్ర‌మాదం జ‌రక్కుండా విద్యుత్ వైర్ల‌ను స్వ‌యంగా తొల‌గించిన‌ కృష్ణారెడ్డి

కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం.. ఆముదాల దిన్నె వ‌ద్ద రోడ్డుకు అడ్డంగా విద్య‌త్ వైర్లు తెగి ప‌డి ఉన్నాయి. ఆ స‌మ‌యంలో.. కావ‌లి మండ‌లం వెంక‌టేశ్వ‌ర‌పురంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొని.. తిరిగి వ‌స్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఆ విద్యుత్ తీగ‌ల‌ను గ‌మ‌నించారు. వెంట‌నే త‌న డ్రైవ‌ర్‌కు చెప్పి.. కారు ఆపించారు. వాటిని ప‌రిశీలించారు. అవి విద్య‌త్ తీగ‌లు కావ‌డంతో.. ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని.. సంబంధిత అధికారుల‌కు స‌మాచారం అందించారు. వాహ‌న‌దారులెవ‌రూ ఇబ్బందిప‌డ‌కూడ‌ద‌ని.. ప్ర‌మాదానికి గురికాకుండా.. ఆయ‌నే స్వయంగా ఆ వైర్ల‌ను త‌ప్పించారు. కావ్య కాల్ చేసిన వెంట‌నే విద్యుత్ శాఖ అధికారుల‌కు అక్క‌డకు చేరుకుని.. మ‌ర‌మ్మ‌త్తులు చేసే వ‌ర‌కు ఆయ‌న కూడా అక్క‌డే ఉండి.. ప్ర‌మాదాలు జ‌ర‌క్కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆయ‌న చ‌ర్య‌ల‌కు కాన్వాయ్‌గా వ‌స్తున్న టీడీపీ నేత‌లు, పోలీసులు, ఇత‌ర ప్రోటోకాల్ సిబ్బంది కావ్య చొర‌వ‌ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *