యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన ధర్మవరం
47వ డివిజన్లో యోగాంధ్ర ర్యాలీ…
- యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన ధర్మవరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు…నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ నేతలు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ ఇన్చార్జి ధర్మవరం గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు డివిజన్లో యోగాంధ్ర అవగాహన ర్యాలీ చేపట్టారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు వారు ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ జీవితంలో యోగాని ఒక భాగం చేసుకోవాలని సుబ్బారావు కోరారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్లు మెహర్నిసా, అలీ, మోసెస్, లక్ష్మి, నాగలక్ష్మి , టీడీపీ మహిళా శక్తి టీం.. సారిక , శ్వేత , అలేఖ్య , సుహాసిని తదిరులు పాల్గొన్నారు..