కావలిలో కథంతొక్కిన తెలుగు మహిళలు
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే
విధంగా వ్యవహరించిన మీడియా సాక్షిని రద్దు చేయాలని డిమాండ్
అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన_
సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి…
- కావలిలో కథంతొక్కిన తెలుగు మహిళలు
- రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన మీడియా సాక్షిని రద్దు చేయాలని డిమాండ్
- అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన సాక్షి మీడియాని రద్దు చేయాలని కావలి తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో జర్నలిస్టులు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని కావలి తెలుగు మహిళలు, జనసేన, భాజపా మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంతరం బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సాక్షి మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి చానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచిపాక కమల, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అలేఖ్య , జనసేన వీర మహిళ గౌసిన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా మహిళ పట్టణ అధ్యక్షురాలు ఆర్షియా బేగం, టిడిపి పట్టణ అధ్యక్షుడు గుత్తి కొండ కిషోర్ , ప్రధాన కార్యదర్శి , జ్యోతి బాబురావు , దేవకుమార్ , జనసేన , భాజపా , తెదేపా మహిళ లు పాల్గొన్నారు.