నెల్లూరులో వైసీపీ మహిళా నాయకురాళ్లు నిరసన
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్…
- నెల్లూరులో వైసీపీ మహిళా నాయకురాళ్లు నిరసన
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
సేవ్ విమెన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ వైసిపి మహిళ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరులో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు.
ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా…నెల్లూరు జిల్లా వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో…నాయకురాళ్లు వీఆర్సీ సెంటర్ లో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నాయకురాళ్లతో కలసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్ల కార్డులు చేతపట్టి కూటమి పాలనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆనం అరుణమ్మ, లక్ష్మీ సునంద, మొయిళ్ల గౌరీలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది పాలనలోనే అనేక నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులు మాని…ఆడ బిడ్డల రక్షణపై శ్రద్ధ పెట్టమని చంద్రబాబుకు హితవు పలికారు.