పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి
మహారాష్ట్రలో మంత్రి నారాయణ…
- పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో కొత్త రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని మంత్రి నారాయణ తెలిపారు. మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆయన అధికారులతో కలసి సందర్శించారు.
మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మంత్రి నారాయణ పర్యటించారు. మహారాష్ట్ర లోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆయన అధికారులతో కలసి సందర్శించారు. ప్లాంట్ పనితీరు, విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రీ చించివాడ్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ప్రభుత్వం నెలకొల్పుతుందని మంత్రి తెలియజేశారు. మంత్రి నారాయణ పర్యటనలో ప్లాంట్ ల స్వచ్చంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.