ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరిలో ఘనంగా ముగిసిన కిశోరి వికాసం బాలికల వేసవి శిక్షణా తరగతులు
పాల్గొన్న సీఐ, ఎంపీపీ, ఎంపీడీవో, అధికారులు
పిల్లలతో తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయాలి
- ఎమ్మెల్యే కురుగొండ్ల
- వెంకటగిరిలో ఘనంగా ముగిసిన కిశోరి వికాసం బాలికల వేసవి శిక్షణా తరగతులు
- పాల్గొన్న సీఐ, ఎంపీపీ, ఎంపీడీవో, అధికారులు
తమ పిల్లలతో తల్లిదండ్రులు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలని…వారితో ఆనందంగా గడపాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండంలో జరిగిన కిశోరి వికాసం బాలికల వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన సీఐ, ఎంపీపీ, ఎంపీడీవోలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని ఆయన సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగించారు. మగ పిల్లలతో సమానంగా ఆడ బిడ్డలను బాగా చదివించాలని ఆయన తల్లిదండ్రులకి సూచించారు. బాలికలకే సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సీఐ, ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ పిడి వసంత భాయ్, సిడిపిఓ శంషాద్ బేగం, సీఐ ఏవి రమణ, ఎంపీపీ తనుజా రెడ్డి, ఎంపీడీవో గుణశేఖర్ రెడ్డి, కెవికె శాస్త్రవేత్త డాక్టర్ విజయశ్రీ, టిడిపి నాయకులు ఆనంద్, బాలికలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.