కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 మంది దివ్యాంగులకి ట్రై సైకిళ్లు పంపిణీ
త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం
- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ
- వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 మంది దివ్యాంగులకి ట్రై సైకిళ్లు పంపిణీ
దివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం ఉంటుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. మంగళవారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 12 మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ తరపున ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…త్వరలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. విపిఆర్ నేత్ర అన్న కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశి రెడ్డి, ఆవుల వాసు, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.