మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చేవూరు
జూన్ 13న నెల్లూరుకి వైఎస్ షర్మిల రాక
- మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చేవూరు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైస్ షర్మిల రెడ్డి ఈనెల 13న నెల్లూరుకి విచ్చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఇందిరా భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో షర్మిల నెల్లూరు పర్యటనకు విచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమె పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.