విజయవంతం చేయాలని పిలుపు
వింజమూరులో MRPS, MSP నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం
జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
- విజయవంతం చేయాలని పిలుపు
- వింజమూరులో MRPS, MSP నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం
నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక వి ఆర్ ఫంక్షన్ ఫ్లాజాలో MRPS, MSP నాయకులు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 7న జరగనున్న 31వ ఎమ్మార్పిస్ ఆవిర్బావ దినోత్సవ కార్యక్రమన్ని విజయవంతం వారు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్పిస్ జాతీయ నాయుకులు మందా. వెంకటేశ్వర రావు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమై జులై 7 నాటికి విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. 31వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జాతీయ జెండా దిమ్మెలను ఏర్పాటు చేసి జులై ఏడో తేదీన ప్రారంభించాలని అందరికీ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు పందిట అంబేద్కర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఉదయ్ మాదిగ, వెంకటేశ్వర్లు మాదిగ, బాల గురవయ్య, మోహన్, సింహాద్రి, ఆనంద్, వెంగళరావు, ఇతర మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.