ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు..

నుడా చైర్మన్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు

భారీ కేక్ కటింగ్_ _పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే పాశిం, టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు

ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు…
నుడా చైర్మన్ కోటంరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
భారీ కేక్ కటింగ్

  • పాల్గొన్న మంత్రి ఆనం, ఎమ్మెల్యే పాశిం, టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు


నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్, టీడీపీ ముఖ్య నేతలు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరి సమక్షంలో భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే బాలయ్య అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. జై బాలయ్య…జై జై బాలయ్య అభిమానుల నినాదాలతో కార్యాలయం మారుమోగిపోయింది. కార్యాలయంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి బాలకృష్ణ సినిమాను ప్రదర్శించారు. బాలయ్య డైలాగులకి అభిమానులు ఈలలు, అరుపులతో ఎంజాయ్ చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ….ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్, బాలయ్యతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావడం అదృష్టం అన్నారు. బాలయ్యకి పద్మభూషణ్ రావడం గొప్ప విషయమని ప్రశంసించారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి మాట్లాడుతూ…. ప్రపంచంలో నేను నమ్మే ఒక వ్యక్తి బాలకృష్ణ అని….రాజకీయంగా ఆయన నమ్మేది నన్నేనన్నారు. బాలకృష్ణ మనస్సున్న మహారాజు చెప్పారు. ఆయన ఆశయాలని కొనసాగించి… కార్యకర్తల రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి భరోసా కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *