రూ. 40వేలు విలువ చేసే 3కేజీల గంజాయి స్వాధీనం
మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడి
గాంజ విక్రయదారుడు అరెస్ట్…
- రూ. 40వేలు విలువ చేసే 3కేజీల గంజాయి స్వాధీనం
- మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడి
గూడూరు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా, ఓ వ్యక్తి వద్ద రూ. 40వేలు విలువ చేసే 3కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని నెల్లూరు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నిందితుడు జార్ఖండ్ కి చెందిన దేవదాస్ గా గుర్తించారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. నెల్లూరులోని రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.