టీడీపీ కార్యాలయం నుంచి తెలుగు మహిళలు ర్యాలీ
సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్
కుప్పంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
- టీడీపీ కార్యాలయం నుంచి తెలుగు మహిళలు ర్యాలీ
- సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్
చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు… దానిని ప్రసారం చేసిన సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.