కాకాణికి మరో 14రోజుల రిమాండ్
సోషల్ మీడియా కేసులో గుంటూరు కోర్టులో హాజరుపరచిన సీఐడీ
ఈనెల 23వరకు రిమాండ్ విధించిన కోర్టు
నెల్లూరుకు తీసుకొస్తున్న సీఐడీ పోలీసులు
కాకాణికి దెబ్బమీద దెబ్బ..!!
-కాకాణికి మరో 14రోజుల రిమాండ్
-సోషల్ మీడియా కేసులో గుంటూరు కోర్టులో హాజరుపరచిన సీఐడీ
-ఈనెల 23వరకు రిమాండ్ విధించిన కోర్టు
-నెల్లూరుకు తీసుకొస్తున్న సీఐడీ పోలీసులు
మాజీ మంత్రి.. వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డికి మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాకాణి.. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆరోపణలు, వ్యక్తిగత ధూషణలు, పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు పోస్టు చేయడంతోపాటు సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగేలా ఉండటంతో.. గతంలోనే సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు సీఐడీ అధికారులు మంగళవారం గోవర్థన్‌రెడ్డిని నెల్లూరు జైలు నుంచి అదుపులోకి తీసుకుని.. గుంటూరు కోర్టుకు తరలించారు. అక్కడి కోర్డులో వాదనలు విన్న మెజిస్ట్రేట్.. కాకాణికి ఈనెల 23 వరకు.. పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ తిర్పు ఇచ్చారు. దీంతో కాకాణిపై దెబ్బమీద దెబ్బ పడ్డట్టైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్, పేలుడు, అట్రాసిటీ కేసుల్లో రిమాండ్‌లో ఉన్న ఆయనకు మరో రిమాండ్ విధింపు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రేపో.. మాపో.. బెయిల్ కోసం కాకాణి న్యాయవాదులు కోర్టును ఆశ్రయించననున్న నేపథ్యంలో.. సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో మరో 14రోజుల రిమాండ్ విధింపు.. చర్చనీయాంశంగా మారింది. కాకాణిపై ఉన్న పాత కేసులన్నింటినీ తిరగతోడుతూ.. ఒక్కో కేసులో రిమాండ్ మీద రిమాండ్ విధించేలా చేసి.. కాకాణిని రిమాండ్ ఖైదీగానే జైల్‌లో ఉంచే అవకాశం ఉందని అంతా చర్చించుకుంటున్నారు.