ఆ నమ్మకంతోనే చంద్రబాబును ప్రజలంతా కలసి గెలిపించారు
గంగపట్నం పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తారు..!
- ఆ నమ్మకంతోనే చంద్రబాబును ప్రజలంతా కలసి గెలిపించారు
గంగపట్నం పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
కోవూరు నియోజకవర్గం.. ఇందుకూరుపేట మండలం.. గంగపట్నం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు శంకుస్థాపన ప్రారంభత్సవాలు పల్లె పండుగ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుందని.. ఇందులో భాగంగా.. గంగపట్నం లో ఉపాధి హామీ పథకం కింద 20 లక్షతొ నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం, జల జీవన్ మిషన్ కింద 38 లక్షల అంచనాతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. సంక్షేమం.. అభివృద్ధి సమపాల్లో చేస్తారనే నమ్మకంతో చంద్రబాబును సీఎంను చేసుకోవడం జరిగిందని.. తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఈసందర్భంగా ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో.. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, పొనుపోయిన చేంచు కిషోర్ బాబు, అవినాష్ రెడ్డి, అన్ని శాఖల ఆదికారులు పలుకొన్నారు, కూటమీ నాయకులు పలుకొన్నారు.