Day: June 11, 2025

ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తారు
ఆ నమ్మకంతోనే చంద్రబాబును ప్రజలంతా కలసి గెలిపించారు గంగపట్నం పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తారు..! కోవూరు నియోజకవర్గం.. ఇందుకూరుపేట మండలం.. గంగపట్నం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు శంకుస్థాపన ప్రారంభత్సవాలు…

మార్కెట్‌లోకి న్యూ ఆల్ట్రోజ్ కార్..!
_కాకుటూరులోని శివశంకర్ మోటార్స్- టాటా షోరూమ్ లో లాంఛనంగా ప్రారంభించిన ఎంవీఐ బాలమురళి మార్కెట్‌లోకి న్యూ ఆల్ట్రోజ్ కార్..!-కాకుటూరులోని శివశంకర్ మోటార్స్- టాటా షోరూమ్ లో లాంఛనంగా ప్రారంభించిన ఎంవీఐ బాలమురళి నెల్లూరు జిల్లా.. వెంకటాచలం మండలం.. కాకుటూరులోని శివ శంకర్ మోటార్స్- టాటా షోరూంలో న్యూ ఆల్ట్రోజ్ కారును ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవాణాశాఖ ఎంవిఐ బాలమురళి ఈ కొత్త కారును లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యూ…

సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి..
కావలిలో కథంతొక్కిన తెలుగు మహిళలు రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన మీడియా సాక్షిని రద్దు చేయాలని డిమాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన_ సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి… రాజధాని ప్రాంత మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన సాక్షి మీడియాని రద్దు చేయాలని కావలి తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. సాక్షి టీవీలో జరిగిన చర్చాకార్యక్రమంలో జర్నలిస్టులు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని కావలి తెలుగు మహిళలు, జనసేన, భాజపా మహిళలు నిరసన ర్యాలీ…

జూన్ 13న నెల్లూరుకి వైఎస్ షర్మిల రాక
మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు చేవూరు జూన్ 13న నెల్లూరుకి వైఎస్ షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైస్ షర్మిల రెడ్డి ఈనెల 13న నెల్లూరుకి విచ్చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఇందిరా భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో షర్మిల నెల్లూరు పర్యటనకు విచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు, ప్రజలు…

త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 మంది దివ్యాంగులకి ట్రై సైకిళ్లు పంపిణీ త్వరలో విపిఆర్ నేత్ర ప్రారంభం దివ్యాంగులకు సేవ చేయడంలో తమకు ఎంతో సంతోషం ఉంటుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. మంగళవారం నెల్లూరులోని విపిఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 12 మంది దివ్యాంగులకు విపిఆర్ ఫౌండేషన్ తరపున ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు….

47వ డివిజన్లో యోగాంధ్ర ర్యాలీ..
యోగాపై ప్రజలకు అవగాహన కల్పించిన ధర్మవరం 47వ డివిజన్లో యోగాంధ్ర ర్యాలీ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు…నెల్లూరు నగరం 47వ డివిజన్లో టీడీపీ నేతలు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ ఇన్చార్జి ధర్మవరం గణేష్ కుమార్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు డివిజన్లో యోగాంధ్ర అవగాహన ర్యాలీ చేపట్టారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు వారు ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల…

పిల్లలతో తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే కురుగొండ్ల వెంకటగిరిలో ఘనంగా ముగిసిన కిశోరి వికాసం బాలికల వేసవి శిక్షణా తరగతులు పాల్గొన్న సీఐ, ఎంపీపీ, ఎంపీడీవో, అధికారులు పిల్లలతో తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయాలి తమ పిల్లలతో తల్లిదండ్రులు ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలని…వారితో ఆనందంగా గడపాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండంలో జరిగిన కిశోరి వికాసం బాలికల వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన సీఐ, ఎంపీపీ, ఎంపీడీవోలతో కలసి…

కుప్పంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం
టీడీపీ కార్యాలయం నుంచి తెలుగు మహిళలు ర్యాలీ సాక్షి మీడియాను రద్దు చేయాలని డిమాండ్ కుప్పంలో జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు… దానిని ప్రసారం చేసిన సాక్షి మీడియాను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్…

గాంజ విక్రయదారుడు అరెస్ట్..
రూ. 40వేలు విలువ చేసే 3కేజీల గంజాయి స్వాధీనం మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడి గాంజ విక్రయదారుడు అరెస్ట్… గూడూరు రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా, ఓ వ్యక్తి వద్ద రూ. 40వేలు విలువ చేసే 3కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని నెల్లూరు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నిందితుడు జార్ఖండ్ కి చెందిన దేవదాస్ గా గుర్తించారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. నెల్లూరులోని రైల్వే…
- 1
- 2