నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితులు నిరసన
NH-67 బాధిత రైతుకి నష్టపహారం చెల్లించాలి
- నెల్లూరు కలెక్టరేట్ ఎదుట భూ నిర్వాసితులు నిరసన
NH-67 బద్వేలు – నెల్లూరు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోయామని, వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని పొదలకూరు మండల భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమసయల పరిష్కార వేదికలో వారు అధికారులకి అర్జీని అందచేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు. ఉద్యానవన పంటలకు, చెట్లు, బోరుబావులు, బిల్డింగ్ లకు రావాల్సిన నష్టపరిహారం చెల్లింపుల్లో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.