మా కాలనీని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారు
తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన ఊటుకూరు ఎస్సీ కాలనీ వాసులు
43 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం…
- మా కాలనీని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారు
- తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన ఊటుకూరు ఎస్సీ కాలనీ వాసులు
గత 43 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాలను కొందరు వ్యక్తులు తమవంటూ ఆక్రమించేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఊటుకూరు ఎస్సీ కాలనీ వాసులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు ఎస్సీ కాలనీలోని సర్వే నెం. 489/2,3 లలో 4 ఎకరాల 98 సెంట్లు భూమిని స్థానికులకు అప్పట్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, స్మశాన వాటిక ఇతర అవసరాల కోసం మంజూరు చేసింది. అప్పటి నుంచి సుమారు 43 సంవత్సరాలుగా అదే స్థలాల్లో జీవిస్తున్న ఎస్సీ కాలనీని ధ్వంసం చేసి ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.