రాపూరు గ్రంధాలయ అధికారి అంజయ్య
సొంత గ్రామానికి రావటం సంతోషంగా ఉంది
- రాపూరు గ్రంధాలయ అధికారి అంజయ్య
తన సొంత గ్రామానికి అధికారిగా రావటం చాలా సంతోషంగా ఉందని గ్రంధాలయ అధికారి అంజయ్య అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు గ్రంధాలయ అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గ్రంధాలయ సిబ్బందితో కలసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంజయ్య మీడియాతో మాట్లాడుతూ… గ్రంథాలయానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానన్నారు. పని దినాలలో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలు గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అంజయ్య కోరారు.