ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని పిలుపు
సంగంలో యోగాంధ్ర ర్యాలీ
- ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని పిలుపు
నెల్లూరు జిల్లా సంగంలో అధికారులు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ షాలెట్ , ఇంచార్జ్ తహసీల్దార్ సంధ్య, టిడిపి మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ఇతర శాఖ అధికారులతో కలిసి రహదారి వరకు యోగా అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని ..యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి వర ప్రసాద్,వెలుగు ఏపీఎం రవిశంకర్ రెడ్డి, ఎంఈఓ మల్లయ్య,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.