పంచాయతీ స్థలం ఆక్రమించినా

పట్టించుకోని అధికారులు

నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అధికారులకి వినతి పత్రం అందచేసిన బాధితుడు

పంచాయతీ స్థలం ఆక్రమించినా…

  • పట్టించుకోని అధికారులు
  • నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో అధికారులకి వినతి పత్రం అందచేసిన బాధితుడు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం మేనాటివారిపాలెంలో గ్రామంలోని సిమెంటు రోడ్డుని స్థానికంగా ఉంటున్న కొందరు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారని బాధితుడు తమ్మిరెడ్డి మాధవయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో అధికారులకి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిమెంటు రోడ్డుని ఆక్రమించి టెంకాయల వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. దీనివల్ల రాకపోకలు సాగించే స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని మండలాధికారుల దృష్టికి పలు మార్లు తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదన్నారు. అందువల్లే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *