తాళ్లపూడి గంగమ్మ జాతర

అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదవులు

ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు నీలం_

తాళ్లపూడి గంగమ్మ జాతర…

  • అంగరంగ వైభవంగా నిర్వహించిన యాదవులు
  • ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు నీలం


ఆదిపరాశక్తి గంగా భవాని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తాళ్లపూడి గ్రామదేవతగా పూజలందుకుంటున్న అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగా భవాని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో ప్రారంభమైన కార్యక్రమం…సాయంత్రం సామూహిక పొంగళ్ల నివేదన, వీరగంధం సమర్పణ, చివరగా రాత్రి గ్రామోత్సవంతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా అమ్మవారిని టీడీపీ మండలాధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దేవస్థానానికి విచ్చేసిన నాయకులకు, తాళ్లపూడి యాదవ సామాజికవర్గం నాయకులు ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *